మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో (Jabalpur Airport) ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై స్కిడ్ అయింది. శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన Alliance Air ATR-72 విమానం జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో (Jabalpur Airport) ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై స్కిడ్ అయింది. శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన Alliance Air ATR-72 విమానం జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే పైలట్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నారు.
