Emergency landing: రాంచీ నుంచి చెన్నై బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం వైద్య కారణాల వల్ల ఆదివారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.
Emergency landing: ఎయిర్ ఏషియా విమానం భువనేశ్వర్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఝార్ఖండ్‌లోని రాంచీ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో.. ఒడిశా భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. ఎయిర్ ఏషియాకు చెందిన ఐఏడీ 1631ఏ320 విమానం రాంచీ ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ క్రమంలో బసంత్ కుమార్ పాశ్వాన్ (40) అనే ప్రయాణీకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సిబ్బందికి తెలియజేయడంతో విమానాన్ని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి.. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల 26 నిమిషాల ప్రాంతంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
అనంతరం.. బసంత్ కుమార్ పాశ్వాన్ ని చికిత్స కోసం భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌కుతరలించినట్లు అధికారులు తెలిపారు. అతనితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా దిగారని అధికారి తెలిపారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
