ల్యాండ్ అవుతుండగా జారిపోయి ప్రైవేట్ జెట్ క్రాష్.. ముంబయి ఎయిర్‌పోర్టులో ఘటన
ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ రన్ వేపై జారిపోయింది. క్రాష్ అయింది. కొద్దిగా మంటలు కూడా వచ్చాయి. ఎమర్జెన్సీసర్వీసెస్ వెంటనే ఆర్పివేశాయి. ప్రమాద సమయంలో ఎనిమిది మంది జెట్‌లో ఉన్నారు. ముగ్గురిని హాస్పిటల్‌లో చేర్చారు.

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ రన్ వే పై జారిపోయింది. రన్ వే పక్కకు వెళ్లి క్రాష్ అయింది. విశాఖపట్నం నుంచి ముంబయికి వెళ్లిన విమానం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆ ప్రైవేట్ జెట్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు క్యాబిన్ క్రూలు ఉన్నారు. ముగ్గురిని హాస్పిటల్‌కు తరలించినట్టు ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. అయితే, వారి గాయాల తీవ్రత గురించి తెలియరాలేదు.
వర్షం కురవడం వల్ల రన్ వే జారుడుగుణాన్ని సంతరించుకుంది. ఈ ఘటన రన్ వే 27 పై చోటుచేసుకుంది. రన్ వే జారుడుగా ఉండటంతోపాటు విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. అప్పుడు విజిబిలిటీ 700 మీటర్ల దూరం ఉండొచ్చని చెబుతున్నారు.
Also Read: భార్యపై తండ్రి రేప్.. ఇప్పుడు నువ్వు నా మమ్మివి అని వదిలేసిన భర్త
అక్కడి నుంచి బయటికి వచ్చిన దృశ్యాల ప్రకారం ఆ విమానం జారుకుంటూ పోయినట్టు అర్థం అవుతుంది. ప్రైవేట్ జెట్ డ్యామేజీ కనిపించింది. తొలుత ఆ ఫ్లైట్ నుంచి మంటలు కనిపించాయి. అయితే, వాటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్పివేశాయి.
ఈ ప్రమాదంతో ఆ రన్ వేను కొద్ది సేపు క్లోజ్ చేశారు.