ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కంటికి కనపడని శత్రువుతో మానవాలంతా యుద్ధం చేస్తోంది. అన్ని దేశాలు కూడా తమకు సాద్యమైనాన్ని చర్యలు తీసుకుంటూ... ఈ కరోనా మహమ్మారి పీడా నుండి బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. 

ఈ వైరస్ కి ఇంకా వాక్సిన్ కానీ, మందు కానీ కనిపెట్టకపోవడంతో ప్రపంచమంతా ఎంతోకొంతమేర ఆ పైవాడిపై భారం వేసి సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారి వదిలి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. 

ఇక మన భారతదేశంలో ఇలాంటి భగవంతుడి సెంటిమెంట్లు మెండు. ఒడిశా రాష్ట్రప్రజలు పూరి జగన్నాథుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఏదైనా కీడు జరిగే ముందు జగన్నాథుడు సంకేతం ఇస్తాడని అక్కడి ప్రజలంతా భావిస్తారు. 

Also Read కరోనా దెబ్బ... ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా...

అలాంటిదే ఒక సంఘటన పూరిలో జరిగింది. అది ఇప్పుడు ఆలస్యంగా దేశమంతా వెలుగులోకి వచ్చింది. మర్చి 20వ తేదీన పాపనాశిని ఏకాదశి సందర్భంగా పూరి ఆలయ గర్భగుడిపై ఉండే గోపురంపైన మహాదీపాన్ని ఏర్పాటు చేసారు. ముఖ్యమైన సందర్భాల్లో ఇలా ఈ మహా దీపాన్ని ఏర్పాటు చేయడం అక్కడి ఆనవాయితీ!

ఇలా ఆ పవిత్ర దినోత్సవం సందర్భంగా మహాదీపాన్ని వెలిగిస్తుండగా బలమైన గాలులు వీయడంతో నీలా చక్రానికి ముడిపడి ఉన్న జెండా కాలిపోయింది. ప్రధాన జెండాకు ఏం కాకపోయినప్పటికీ ప్రధాన బాణ కింద ఉన్న జెండా పూర్తిగా క్షణాల్లో భస్మమయిపోయిందని అధికారులు తెలిపారు. 

ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇలా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపు చేసి వేరే ఎటువంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. మిగిలిన ఆలయ కారక్రమాలకు ఈ సంఘటన వల్ల ఎటువంటి ఆటంకం కలుగలేదని ఆలయ అధికారులు తెలిపారు. 

Also Read కరోనా దెబ్బ... ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి వాయిదా...

ఇలా పూరి జగన్నాథుడి గర్భాలయంపైనున్న జెండా ఒక్కసారిగా అంటుకోవడంతో ఇది కీడు సంకేతంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ ఇలాంటి సూచకం మంచిది కాదని ఒడిశా ప్రజలు అంటున్నారు. 

మరోపక్క కరోనా నివారణకు ఒడిశా ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలను చేపడుతుంది. ఇప్పటికే రాయాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. క్వారంటైన్ లో ఉన్న ఇండ్లకు ప్రభుత్వం స్టిక్కర్లను అంటిస్తోంది. 

కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తుంది. అంటి మలేరియా మందును కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వ్యక్తులకు ఇవ్వాల్సిందిగా ఐసిఎంఆర్ సూచించింది. 

భారతదేశంలోకి బయట నుంచి వచ్చే అన్ని మార్గాలను మూసేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త వైరస్ దేశంలోకి కొత్తగా వచ్చే ఆస్కారం లేనే లేదు. కాబట్టి లోపలున్న వైరస్ ని అడ్డుకోగలిగితే... కరోనా ను మనం ఎదుర్కున్నట్టే అని ప్రభుత్వం తెలుపుతోంది. 

ప్రజలు ఈ కరోనా వైరస్ పట్ల అవగాహనతో ఉండడం అవసరం. అంతే తప్ప దీనిపై ఎటువంటి భయాందోళనలకు గురికావలిసిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ వైరస్ ని అంతమొందించేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది.