ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతటి ప్రళం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. కాగా,.. ఈ కరోనా దెబ్బతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనవరాలి పెళ్లి ఆగిపోయింది. సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read కరోనావైరస్ ఎఫెక్ట్: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు...

పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మనుమరాలు వనమా అలేఖ్య వివాహం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వాయిదాపడింది. ఈ విషయాన్ని సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వనమా వెల్లడించారు. వనమా పెద్దకుమారుడు రాఘవేందర్‌రావు పెద్దకుమార్తె అలేఖ్య నిశ్చితార్థం గత నెలలో నిర్వహించారు. ఏప్రిల్‌ 4న పాల్వంచలో పెళ్లి జరగాల్సి ఉంది.

సీఎం కేసీఆర్‌ను, ఉమ్మడి తెలుగు ప్రభుత్వాల మంత్రులు, ఎమ్మెల్యేలను వేడుకకు ఆహ్వానించామన్నారు. వేలమంది అభిమానుల సమక్షంలో నిర్వహించిన తలపెట్టిన వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక కార్యక్రమలు రద్దవుతుండటంతో సీఎం కేసీఆర్‌ సూచన మేరకు వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వనమా వివరించారు.