కన్నకూతురని కూడా చూడకుండా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మేనమామ కూడా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వీరిద్దరికి 84యేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 

తిరువనంతపురం : చిన్నారిపై అత్యాచారం కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు ఇద్దరు వ్యక్తులకు 84 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కన్నతండ్రి, మేనమామ.. ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో కేరళలోని ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం వీరిద్దరికి 84 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది, అంతేకాదు వివిధ సెక్షన్ల కింద వేసిన ఈ శిక్షణ అన్నింటిని ఒకేసారి అనుభవించాలని ఆదేశాలు జారీ చేసింది.

దోషులు మొత్తంగా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కేరళలోని దేవి కులం ఫాస్ట్ ట్రాక్కోర్టు ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ, జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఇద్దరు దోషులకు మొత్తంగా 84 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కేసులన్నింటిలో గరిష్ట శిక్ష 20 యేళ్లు. దీంతో ఈ శిక్షలు అన్నింటిని వారు ఒకేసారి అనుభవించారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్న బీజేపీ నేత కుమార్తె.. వెడ్డింగ్ కార్డుపై సోషల్ మీడియాలో కామెంట్లు

జైలు శిక్షలతో పాటు ఇద్దరు దోషులకు చెరో మూడు లక్షల జరిమానా విధించింది. వారిద్దరి నుంచి ఆ డబ్బులను వసూలు చేసిన తర్వాత ఆ సొమ్మును బాధితురాలికి అందించాలని తెలిపింది. ఈ పరిహారంతో పాటు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కూడా బాధితురాలికి పరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి రవిచంద్ర సి ఆర్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే 2021లో కేరళలోని దేవి కులానికి చెందిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురి మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

తండ్రితో పాటు ఆ చిన్నారికి మేనమామ వరస అయ్యే వ్యక్తి కూడా ఈ దారుణానికి తెగించాడు. కాగా, చిన్నారి తల్లి 2021 డిసెంబర్ 24న ఈ దారుణాన్ని చూడడంతో విషయం వెలుగు చూసింది. వెంటనే ఆమె శిశు సంక్షేమ శాఖ కమిటీకి ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం 18 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 2022లో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిమీద విచారణ చేపట్టిన ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. చిన్నారి తండ్రి మేనమామలు ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఈ శిక్షలు ఖరారు చేసింది.