Asianet News TeluguAsianet News Telugu

అక్రమంగా బొగ్గు మైనింగ్.. గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు...!

మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు.

five persons trapped in illegal coal mine in meghalaya - bsb
Author
Hyderabad, First Published Jun 1, 2021, 9:20 AM IST

మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు.

ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురు అస్సాంకు చెందినవారని సిల్చార్ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. 

వాతావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్‌ జైంతియా హిల్స్‌ ఎస్పీ జగ్‌పాల్‌ ధనోవా పేర్కొన్నారు. 

ఈ ఘనటకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 

జైంతియా హిల్స్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయం మీద తనకు అంత అవగాహన లేదని స్తానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios