భారత్‌లో 30 వేలకు చేరువలో కరోనా కేసులు: ఈ 5 రాష్ట్రాలు మాత్రం కరోనా ఫ్రీ
దేశంలో కరోనా వైరస్ కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ రోజూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే దేశంలోని ఐదు రాష్ట్రాలు మాత్రం కరోనా నుంచి బయటపడ్డాయి.
దేశంలో కరోనా వైరస్ కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ రోజూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే దేశంలోని ఐదు రాష్ట్రాలు మాత్రం కరోనా నుంచి బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే... ఈశాన్య భారతంలోని సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలు కోవిడ్ 19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Also Read:85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ
ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కరోనా కేసులు నమోదు కాలేదని జితేంద్ర తెలిపారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
లాక్‌డౌన్ కారణంగా నిత్యావసర సరకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎయిరిండియా, భారతీయ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, లఢఖ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు తరలిస్తున్నట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Also Read:లోపాలు, చైనా టెస్టింగ్ కిట్స్ వెనక్కి: కేంద్రం కీలక నిర్ణయం
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కట్టడికి షిల్లాంగ్‌లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందించామని జితేంద్ర గుర్తుచేశారు.
కాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,396 కేసులు నమోదవ్వగా, 389 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 85 రాష్ట్రాల్లో 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 28 జిల్లాల్లో గత 16 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.