బీహార్‌లో నవాడా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగి మృతిచెందారు. మొత్తం ఆరుగురు విషం తాగగా.. అందులో ఐదుగురు మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీహార్‌లో నవాడా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగి మృతిచెందారు. మొత్తం ఆరుగురు విషం తాగగా.. అందులో ఐదుగురు మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చేసిన అప్పులు తీర్చలేకనే బాధిత కుటుంబం ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. బాధిత కుటుంబం రాజౌలీకి చెందినదని చెబుతున్నారు. వారు నవాడాలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పండ్ల వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నారు. అయితే వారు అప్పు తీసుకున్న చోటు నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది.
అప్పు తీర్చాలంటూ పదే పదే ఒత్తిడి చేయడంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా తాము అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి.. విషం తాగారు. అయితే ఇది గమనించినకొందరు వారిని ఆస్పత్రికి తరలించారు. విషం తాగిన వెంటనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరోకరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
ఇక, మృతులను కేదార్‌నాథ్ గుప్తా, ఆయన భార్య అనితాదేవి, ఇద్దరు కుమార్తెలు షబ్నం కుమారి, గుడియా కుమారి, కుమారుడు ప్రిన్స్ కుమార్‌లుగా గుర్తించారు. సాక్షి కుమారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
