Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరకాశీ హిమపాతం ఘ‌ట‌న‌లో మ‌రో ఐదు మృత‌దేహాలు ల‌భ్యం.. ఇద్దరు పర్వతారోహకుల కోసం కొన‌సాగుతున్న గాలింపు

ఉత్తరకాశీ హిమపాతం బాధితుల మృతదేహాలను మట్లీలోని ఐటీబీపీ శిబిరానికి రెస్క్యూ సిబ్బంది సోమవారం తీసుకువచ్చారు. మరో ఇద్దరు పర్వతారోహకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Five more dead bodies found in Uttarkashi avalanche incident.. Search continues for two mountaineers
Author
First Published Oct 10, 2022, 3:54 PM IST

ఉత్త‌రకాశీ హిమపాతం ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన మ‌రో ఐదుగురి మృత‌దేహాల‌ను సిబ్బంది వెలికితీశారు. వాటిని సోమవారం మట్లీలోని ఐటిబిపి శిబిరానికి తీసుకువచ్చారు, అయితే ఇప్ప‌టికీ గల్లంతైన మ‌రో ఇద్దరు పర్వతారోహకులను గుర్తించేందుకు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అయితే నిరంత‌రంగా కురుస్తున్న మంచు వ‌ల్ల ఈ ప్ర‌య‌త్నాల‌కు ఆట‌కం క‌లుగుతోంది.

యూపీ ప్రభుత్వ లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు.. ఎక్క‌డ జరుగనున్నాయంటే..?

తాజా గ‌ణాంకాలంతో క‌లిసి శిఖరాగ్ర శిబిరం నుండి ఇప్పటివరకు తీసుకువచ్చిన మృతదేహాల సంఖ్య 26 కు చేరుకుందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా తెలిపారు. ‘‘ ఒక మృతదేహం ఇంకా శిఖరాగ్ర శిబిరంలో ఉంది, గల్లంతైన ఇద్దరు పర్వతారోహకుల కోసం అన్వేషణ కొనసాగుతోంది ’’ అని ఆయన చెప్పారు.

ప్రకృతి మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది... ఆనంద్ మహీంద్ర మోటివేషనల్ ట్వీట్...!

నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ లో అధునాతన పర్వతారోహణ కోర్సులో భాగమైన 27 మంది ట్రైనీలు, ఇద్దరు బోధకులతో సహా 29 మంది పర్వతారోహకులు అక్టోబర్ 4వ తేదీన ద్రౌపది కా దండ-2 శిఖరం నుంచి తిరిగి వస్తుండగా 17,000 అడుగుల ఎత్తులో భారీ హిమపాతం కారణంగా గల్లంతయ్యారు.

అర్బన్ నక్సలైట్స్ ను గుజ‌రాత్ అనుమతించదు - ప్రధాని న‌రేంద్ర మోడీ..

ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, ఐఏఎఫ్ లు ఒకే రోజు మల్టీ ఏజెన్సీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాయి. ‘‘ హిమపాతం-ప్రభావిత ప్రదేశంలో నిరంతర హిమపాతం శోధన కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తోంది. కానీ తప్పిపోయిన ఇద్దరు పర్వతారోహకులను కనుగొనడానికి ఇలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనూ ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ఈ ఆపరేషన్ త్వరలో ముగుస్తుందని మేము ఆశిస్తున్నాము ’’ అని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios