Asianet News TeluguAsianet News Telugu

ప్రకృతి మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది... ఆనంద్ మహీంద్ర మోటివేషనల్ ట్వీట్...!

 తాజాగా సోమవారం మరో మోటివేషనల్ వీడియోని ఆయన షేర్ చేశారు. అందులో ఒక గ్రద్ద గురించి షేర్ చేయడం గమనార్హం. వీడియోలో... గ్రద్ద... గాలికి ఎదురు వీస్తున్నా.. అది ఏ మాత్రం చలించకుండా ఫోకస్ గా ఉంది.

Anand Mahindra's Monday Motivation Video is Everything You Need to Learn Today
Author
First Published Oct 10, 2022, 3:36 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర గురించి తెలియనివారు ఉండరేమో. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు ట్విట్టర్ లో 9.8మిలియన్ల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు...తనకు నచ్చిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా అందరికీ మోటివేషన్ కల్పించే విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. తాజాగా సోమవారం మరో మోటివేషనల్ వీడియోని ఆయన షేర్ చేశారు. అందులో ఒక గ్రద్ద గురించి షేర్ చేయడం గమనార్హం. వీడియోలో... గ్రద్ద... గాలికి ఎదురు వీస్తున్నా.. అది ఏ మాత్రం చలించకుండా ఫోకస్ గా ఉంది. తన రెక్కలను వాల్చకుండా.. కిందకు తనకు ఆహారం ఎక్కడ లభిస్తుందా అని ఆ పక్షి చూస్తుండటం గమనార్హం. కాగా... ఈ వీడియో ఆనంద్ మహీంద్రాకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ వీడియోని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దానికి ఓ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొబత్తం 31 సెకన్లు ఉన్న వీడియో ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

‘ప్రకృతి మనకు జీవిత పాఠాలు నేర్పించడంలో ఎప్పుడూ విఫలం కాదు. జీవితంలో విపత్కర పరిస్థితులను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు..? ఏ వృత్తిలో ఉన్నా.. మిమ్మల్ని ఎదురు గాలులు తాకినప్పుడు కూడా మీ రెక్కలను అలానే ఉంచండి. తల స్థిరంగా ఉంచాలి. మీ కళ్లు అప్రమత్తంగా ఉండాలి.’ అంటూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.

 

ఈ రోజు ఉదయం ఆయన షేర్ చేసిన ఈ వీడియోకి 4.4 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. కాగా... నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపించారు.  సంకల్పనానికి ఇదే అసలైన ఉదాహరణ అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.


 "ప్రకృతి నిజమైన గురువు. మీరు దానిని ఎంత ఎక్కువగా పరిశీలిస్తే, మీరు సైన్స్ గురించి అంత ఎక్కువగా నేర్చుకుంటారు." ఒక నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios