అసహజ శృంగారం:ప్రైవేట్ పార్ట్స్‌ల్లో రాడ్, మొబైల్ లో రికార్డింగ్

First Published 17, Jun 2018, 11:50 AM IST
Five Men Sodomise Teen in Ghaziabad, Insert Iron Rod in Rectum While Filming Act
Highlights

యూపీలో యువకుడిపై అసహజ శృంగారం


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఓ యువకుడిపై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితుడిని తీవ్ర చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనను వీడియో తీశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీనేజర్ పై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. బాధిత యువకుడు తన బైక్ ను సర్వీసింగ్‌కు ఇచ్చి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మెకానిక్‌ షాప్‌లో ఉన్న ఐదుగురు యువకులు ఆ టీనేజర్‌ను లోపలికి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించారు. టీనేజర్‌ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా కొట్టి వ్యక్తిగత అవయవాల్లో ఐరన్‌ రాడ్‌ జొప్పించి వేదింపులకు గురిచేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్ లో రికార్డు చేశారు. బాధితుడి వద్ద ఉన్న రూ.1600 నిందితులు లాక్కొన్నారని  పోలీసులు తెలిపారు.  బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

తన కుమారుడిని నిందితులు కొంతకాలం నుంచి వేధిస్తున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు కూడా ఉన్నట్లు ఆయన ఆరోపించారు.

loader