Asianet News TeluguAsianet News Telugu

అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి...

గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  హింద్ హోటల్ సమీపంలో ఉన్న వంతెన వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టి వంద మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

five members of one family died in a road accident in jharkhand
Author
Hyderabad, First Published Nov 23, 2021, 12:26 PM IST

జార్ఖండ్ : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఆగడం లేదు,  జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్టేక్, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  తాజాగా jharkhandలో మంగళవారం జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.

గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  హింద్ హోటల్ సమీపంలో ఉన్న వంతెన వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టి వంద మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు భావిస్తున్నారు.  ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు వివరాల ఆధారంగా.. మృతదేహాలను  గుర్తిస్తున్నారు. dead bodies కారులోనే ఇరుక్కుపోవడంతో  స్థానికుల సహాయంతో బయటికి తీశారు పోలీసులు.  మృతదేహాలను postmartam నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.  మృతులంతా రాయగఢ్ నుంచి అనసోల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

జార్ఖండ్ లోని ధన్ బాద్ లో మంగళవారం ఉదయం ఘోర road accident జరిగింది. కారు అదుపు తప్పి బ్రిడ్జి పక్కనే ఉన్న నది లోకి దూసుకు పోవడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక పిల్లవాడు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో అక్కడంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వాహనంలోని ఐదుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. 

నిన్న మేకలదొంగల చేతుల్లో ఎస్ఐ, నేడు వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. చెన్నైలో వరుస దారుణాలు..

ఇదిలా ఉండగా, సోమవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా shad nagar పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొందుర్గుమండల మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

వివరాలు.. షాద్ నగర్ నుంచి పరిగి వైపు వెళ్తున్న బొలెరా వాహనం..  పరిగి వైపు నుండి షాద్  నగర్ వస్తున్న టాటా ఏసీ వాహనం ఓవర్ స్పీడ్ తో ఒక దానికి మరొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో వెంకటయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని చటాన్‌పల్లికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదంలో మరో ముగ్గురకి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వీరు వాహనంలోనే ఇరుక్కుపోయారు. వీరికి బయటకు తీసేందుకు రెండు గంటల పాటు శ్రమించిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. దీంతో చివరకు జేసీబీ సాయంతో వీరిని బయటకు తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఇందుకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios