ప్రత్యేక ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించి.. టెంట్‌లో కృత్రిమ సూర్యకాంతిని సృష్టించి ఎయిర్ కండిషన్డ్ గదిలో గంజాయిని సాగు చేస్తున్న హైటెక్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక : కర్ణాటకలోని శివమొగ్గలో హైటెక్ గంజాయి సాగు విస్తుపోయేలా చేసింది. ఏసీ గదుల్లో గంజాయి సాగు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ఐదుగురు ఫైనల్ ఇయర్ మెడికల్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన విద్యార్థులు విఘ్నరాజ్, వినోద్ కుమార్, విఘ్నర, పాండిదురై, ధర్మపురి శివమొగ్గ సమీపంలోని పురాలే గ్రామంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదే కాలేజీకి చెందిన మరో ఇద్దరు ఇంటర్న్‌లు, అబ్దుల్లా, అర్పిత గంజాయి సరఫరా చేస్తున్నందుకు పోలీసులుఅరెస్టు. చేశారు. వారిని విచారణ చేస్తున్న క్రమంలో ఈ హైటెక్ గంజాయ సాగు వ్యవహారం వెలుగు చూసింది.
డ్యూటీ టైం అయిపోయింది, విమానం తీయను.. మొండికేసిన ఎయిరిండియా పైలెట్.. చివరికి... వీడియో వైరల్..
విచారణలో తెలిసిన విషయాల ప్రకారం, పోలీసులు ఒక అద్దె ఇంటిపై దాడి చేసి, కుండీలలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ గంజాయి పెంపకం కోసం హైటెక్ సెటప్‌ను చేయడం చూసి ఆశ్చర్యపోయారు. సాగు చేసిన తరువాత వాటిని ఎండబెట్టి చిన్న ప్యాకేజీలలో విక్రయిస్తున్నారు.
హై-టెక్ సెటప్‌లో భాగంగా ఎయిర్ కండీషన్ట్ రూంలో ఓ కాన్వాస్ టెంట్ ఏర్పాటు చేసి.. అందులో ఎల్ఈడీ ప్యానెల్ లైట్లు, ఆరు ఫ్యాన్‌లు అమర్చారు. ఈ ఆపరేషన్‌లో, పోలీసులకు పచ్చి గంజాయి, ఎండు గంజాయి, సాగు పరికరాలు, గంజాయి దాచిన కుండలు, నాజిల్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు గురించి శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) మిథున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులు ఇంటర్నెట్ లో గంజాయి సాగుపై వివరాలను సేకరించారని, దీన్ని ఎలా సాగు చేయాలో కూడా ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకున్నారని తెలిపారు. ఇక గంజాయి సాగు కోసం విత్తనాలను కూడా ఆన్ లైన్ లోనే తెప్పించుకున్నారని తెలిపారు.
వైద్య విద్యార్థులపై అభియోగాల గురించి మాట్లాడుతూ, నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన అక్రమ లాభాలను తమకు సహకరించిన విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు ఎస్పీ కుమార్ తెలిపారు
