Asianet News TeluguAsianet News Telugu

డ్యూటీ టైం అయిపోయింది, విమానం తీయను.. మొండికేసిన ఎయిరిండియా పైలెట్.. చివరికి... వీడియో వైరల్..

ఎయిరిండియాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదివారం అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం... ఆ తరువాత పైలెట్ కారణంగా 5 గంటలపాటు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

Air India pilot refused to fly, leaving passengers in Jaipur for 5 hours, video viral - bsb
Author
First Published Jun 26, 2023, 1:07 PM IST

జైపూర్ : ఎయిర్ ఇండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది.  ఈసారి పైలెట్ ప్రవర్తన వారిని చిక్కుల్లో పడేసింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అత్యవసర లాండింగ్ చేయాల్సి వచ్చి  జైపూర్ లో దిగింది. ఆ తర్వాత మళ్లీ టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు పైలెట్  తాను టేక్ ఆఫ్ చేయనని చెప్పడం వివాదంగా మారింది. దీంతో విమానం కొన్ని గంటల పాటు జైపూర్ విమానాశ్రయంలోనే ఉండిపోయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ పైలెట్ విమానం తీయకపోవడానికి కారణం ఏంటంటే అతని డ్యూటీ టైం అయిపోయిందట.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన  ఏఐ-112 విమానం లండన్ నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ల్యాండ్ చేయడానికి వీలుకాక అక్కడే పది నిమిషాల పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన విమానం ఆ తర్వాత రాజస్థాన్లోని జైపూర్లోకి దారి మళ్ళింది.  అలా రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలోఅత్యవసర లాండింగ్ అయ్యింది.

విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. విమానం తిరిగి ఢిల్లీ వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఇక్కడే పైలెట్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను విమానాన్ని టేక్ ఆఫ్ చేయనంటూ మొండి పట్టు పట్టాడు. ఎందుకు అని ఆరా తీస్తే.. డ్యూటీ సమయం అయిపోయిందని.. డ్యూటీ పరిమితులు, పనిగంటలను  కారణంగా చూపించాడు. తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. 

దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు.  జైపూర్ ఎయిర్పోర్టులోనే దిక్కుతోచక చిక్కుకుపోయారు. జైపూర్ ఎయిర్పోర్టులోనే దిక్కుతోచకా చిక్కుకుపోయారు. ఈ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో వీరు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జైపూర్ ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాసారు. కొంతమంది  రోడ్డు మార్గాన  గమ్యస్థానానికి బయలుదేరారు. 

మిగతా ప్రయాణికులు మూడు గంటల పాటు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాసి ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసిన తర్వాత.. విమానంలో తిరిగే ఢిల్లీ చేరుకున్నారు. అయితే, దీన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఘటన మీద, పైలెట్ ప్రవర్తన, ప్రయాణికుల ఇబ్బందుల మీద  ఎయిరిండియా ప్రయాణికుల ఇబ్బందుల మీద ఎయిర్ ఇండియా ఇప్పటివరకు స్పందించలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios