Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నది. ఆ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని తెలియగానే అప్రమత్తమైన మిలిటరీ అక్కడికి చేరి కార్డన్ సెర్చ్ చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులు ఆర్మీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారు.
 

five jawans killed in jammu kashmir
Author
Srinagar, First Published Oct 11, 2021, 1:58 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగాయి. ముఖ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అధికమయ్యాయి. అలాగే, pakistan నుంచి సరిహద్దు గుండా పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు jammu kashmirలోకి చొరబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు పటిష్టంగా కాపలా కాస్తున్నారు. ఉగ్ర సమాచారం అందగానే వెంటనే వెళ్లి చుట్టుముడుతున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. తాజాగా, జమ్ము కశ్మీర్‌లోని poonch సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ ఏరియా నుంచి బయటికి వెళ్లే దారులు మూసేసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తెల్లవారుజామునే మొదలుపెట్టారు. 

భద్రతా వలయం ఉచ్చులో ఉగ్రవాదులు చిక్కారు. కార్డన్ సెర్చ్ చేస్తున్న జవాన్లు సమీపిస్తుండటంతో ఆయుధాలతో వారిపై firingకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలోనే వారు వీరమరణం పొందారు. ఇందులో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్టు army అధికారిక ప్రకటన వెల్లడించింది. అలాగే, ఇరువైపుల encounter ఇంకా కొనసాగుతున్నదని వివరించింది.

Also Read: కశ్మీర్‌లో సాధారణ ప్రజల ఊచకోత.. రంగంలోకి సైన్యం, 570 మంది ఉగ్రవాదుల అరెస్ట్

సురన్‌కోటె సబ్ డివిజన్‌లోని ముఘల్ రోడ్ సమీపంలోని అడవుల గుండా ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎల్‌వోసీ గుండా మనదేశంలోకి చొరబడ్డ ఈ ఉగ్రవాదుల దగ్గర పెద్దమొత్తంలో మందుగుండు, పేలుడు సామగ్రి ఉన్నట్టు సమాచారం ఉన్నదని వివరించారు. చొరబాటులను అనుమానిస్తున్న దారులనూ అధికారులు మూసేస్తున్నారు. చొరబాటు సమాచారం అందగానే ఆర్మీ ఆ ప్రాంతానికి తరలివెళ్లిందని ఓ మిలిటరీ అధికారి వెల్లడించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. ఇంకా ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అనంత్‌నాగ్, బందిపొరా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక్కో ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios