జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు సజీవ దహనం కావడంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఉగ్రవాదుల గ్రనేడ్ డాది వల్లే ప్రమాదం జరిగిందని భారత సైన్యం ధ్రువీకరించింది.
జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు సజీవ దహనం కావడంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. బింభేర్ గాలి నుంచి పూంచ్ జిల్లిలోని సాంగియోట్ వైపు వెళ్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పిడుగుపాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగినట్లుగా తొలుత జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సైన్యం ధ్రువీకరించింది.
ఇకపోతే.. గత బుధవారం పంజాబ్లోని భటిండా సైనిక స్థావరంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన సైనిక స్థావరం మీద కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ ఘటనలో పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు బాధ్యుడిగా ఓ జవాన్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు భటిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ కాల్పుల కేసులో మొదట తమను తప్పుదోవ పట్టించిన సైనికుడే అసలు నిందితుడని వెల్లడించారు.
Also Read: విషాదం : ఆర్మీ వాహనంలో మంటలు.. నలుగురు జవాన్లు సజీవదహనం
అతనే కాల్పులకు పాల్పడినట్లు గుల్నీత్ సింగ్ తెలిపారు. మోహన్ దేశాయ్ అనే నిందితుడు సైనిక స్థావరంలో గన్నర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడిని ఈ కేసులో అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన కారణాలు వ్యక్తిగతమైనవని తెలిపారు. మోహన్ దేశాయ్ కి కాల్పుల్లో మృతి చెందిన జవాన్లతో వ్యక్తిగత కక్షలు ఉన్నాయని ఎస్ఎస్పి తెలిపారు. భటిండా సైనిక స్థావరంలో ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ కాల్పుల ఘటనలో చనిపోయిన వారిలో ఇద్దరు కర్ణాటక కు చెందిన వారు.. కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన జవాన్లు. వీరి పేర్లు జె. యోగేష్ కుమార్ (24), సాగర్ బన్నీ (25), సంతోష్ ఏం నగరాల్ (25), ఆర్ కమలేష్ (24)లు మృతి చెందారు. దేశంలోని అతిపెద్ద సైనిక స్థావరంలో భటిండా స్థావరం ఒకటి. ఇక్కడ పదవ కోర్ కమాండ్ కు చెందిన దళాలు ఉంటాయి. ఇది జైపూర్ కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది . ఈ స్థావరంలో అనేక కీలక పరికరాలు, పెద్ద సంఖ్యలో ఆపరేషన్ ఆర్మీ యూనిట్లు ఉంటాయి.
