Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తమోడుతున్న పాపతో 5 ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తండ్రి... పరిస్థితి విషమం...

తల్లి ఏమైందని అడగగా.. ఒక అంకుల్ పెన్ను, పుస్తకం ఇస్తానని చెప్పి తనతో ఒక గదిలో తీసుకెళ్లాడని చెప్పింది. తల్లి పాపను గమనించగా రక్తస్రావమవుతోంది. ఏం జరిగిందో అర్తం చేసుకున్న తల్లి, తండ్రికి ఫోన్ చేసింది.

five hospitals denies treatment to 6-year-old rape victim in delhi
Author
Hyderabad, First Published Oct 25, 2021, 10:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం సిగ్గు పడేలా ఒక ఘటన జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేయగా... ఆ పాపకు చికిత్స అందించడానికి పాప తండ్రి ఐదు ఆస్పత్రుల చుట్టూ నాలుగు గంటలపాటు 15 కి.మీ. తిరిగాడు. ఆ సమయంలో పాపకు తీవ్రంగా bleeding అవుతోంది. అయినా ఆస్పత్రులు కనికరించలేదు. ప్రస్తుతం పాప ఆస్పత్రి ఐసీయూలో ఉన్నా ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. 

మీడియా ఆ తండ్రిని, పాప ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఏడుస్తూనే జరిగింది చెప్పుకొచ్చాడు. రిక్షాలాగుతూ జీవనం సాగించే అతను.. అతని భార్య ఇళ్లలో పనిచేస్తుంది. రోజూలాగే శుక్రవారం వారిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. 

ఉదయం 10 గంటలకు అతడి భార్య ఫోన్ చేసింది. పాపకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పగానే.. పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట జనం అప్పటికే గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లగానే.. పాపకు రక్తస్రావం అవుతోందని తెలిసింది. 

ఎవరో పాపపై అత్యాచారం చేశారని తెలిసి షాక్ కు గురయ్యారు. ఇరుగుపొరుగువారు అతనికి ధైర్యం చెప్పి.. అంబులెన్స్ ని పిలిచించారు. అంబులెన్స్ లో రక్తమోడుతున్న పాపను తీసుకుని ముందుగా దగ్గరలోకి సర్దార్ పటేల్ ఆస్పత్రికి వెళ్లాడు. 

అప్పటికే సమయం 11 గంటలు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది పాపకు తాము treatment అందించలేమని మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఆ తరువాత పాపను తీసుకుని లేడీ హార్డింగ్ ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికి సమయం మద్యాహ్నం 12 గంటలు. లేడీ హార్డింగ్ ఆస్పత్రి సిబ్బంది అతనికి కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. 

ఇప్పటికే ఆలస్యం అయ్యిందని పాపను బతికించమని అతను ఆస్పత్రి సిబ్బందిని ఎంత బతిమాలినా వారు వినలేదు. ఏమీ చేయలే.. కళావతి ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది ఈ case తమ పరిధిలోకి రాదని చెప్పి.. తిరిగి లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. 

పాప నొప్పి భరించలేక ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలో తోచక.. మళ్లీ 
Lady Harding Hospitalకి వచ్చాడు. అప్పటికి సమయం ఒంటిగంట. కానీ అక్కడ మళ్లీ పని జరగక అక్కడి నుంచి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. Ram Manohar Lohia Hospitalలో పాపను చేర్చుకున్నారు. అప్పటికి సమయం దాదాపు 2 గంటలైంది. 

ఎలా జరిగిందంటే...
శుక్రవారం child father రిక్షా తీసుకుని బయటికి వెళ్లాడు. తల్లి ఇళ్లలో పనికి వెళ్లింది. పాప ఉదయం గురుద్వార నుంచి free meals తీసుకొచ్చింది. ఆ తరువాత మళ్లీ బయటికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంది. 

తల్లి ఏమైందని అడగగా.. ఒక అంకుల్ పెన్ను, పుస్తకం ఇస్తానని చెప్పి తనతో ఒక గదిలో తీసుకెళ్లాడని చెప్పింది. తల్లి పాపను గమనించగా రక్తస్రావమవుతోంది. ఏం జరిగిందో అర్తం చేసుకున్న తల్లి, తండ్రికి ఫోన్ చేసింది.

కేవలం 15 నిమిషాల్లో రూ.కోటి దొంగతనం.. బంగారం దుకాణంలోకి ప్రవేశించి..!

పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ మొదలు పెట్టారు. ఒక సీసీటీవీ వీడియోలో ఒక యువకుడు పాపను తీసుకెడుతున్నట్లు కనిపించింది. accussedకి దాదాపు 25 యేళ్ల వయసు ఉంటుంది. కానీ అతను ముఖానికి mask వేసుకుని ఉండడంతో అతడిని గుర్తించడం కష్టం గా ఉందని పోలీసులు అంటున్నారు. 

rape జరిగినట్లు ఫిర్యాదు అందినా.. ఇప్పటివరకు నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని.. పాప family members, ఇరుగుపొరుగు వారు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు ఈ కేసులో నోటీసులు పంపినట్లు సమాచారం. ఘటన జరిగి 36 గంటలు గడిచినా ఇంకా పాప ఆరోగ్యం కుదుట పడలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios