జమ్మూకాశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు కలిసి అరెస్టు చేశారు. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినవారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల సహచరులను భద్రతా బలగాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ లోని క్రాల్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తులు ఉన్నారని, ఆ ప్రదేశంలో హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ఉగ్రవాద కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని మిలటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి కుప్వారా జిల్లా పోలీసులకు, ఇండియన్ ఆర్మీకి విశ్వసనీయ సమాచారం అందింది. వీరంతా ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పించడంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అలాగే ఇతర అవసరమైన లాజిస్టిక్ లను కూడా అందజేస్తున్నారని తెలిసింది.

డ్రైనేజ్ పైపుల పని చేస్తుంటే కూలిన మట్టిపెళ్లలు.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి...

ఈ సమాచారం ఆధారంగా జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ జాయింట్ టీం గా ఏర్పడి ముగ్గురు తీవ్రవాద సహచరులను పట్టుకున్నాయి. వారిని క్రల్‌పోరాలోని దర్ద్‌సన్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రౌఫ్ మాలిక్, అల్తాఫ్ అహ్మద్ పేయర్‌గా గుర్తించారు. మరొకరు క్రాల్‌పోరా ప్రాంతానికి చెందిన రియాజ్ అహ్మద్ లోన్ అని పోలీసులు పేర్కొన్నారు.

Scroll to load tweet…

నిందితుల నుంచి ఒక ఏకే -56, రెండు ఏకే -మ్యాగ్, 119 ఏకే-రౌండ్‌లు, ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్, నాలుగు పిస్టల్ రౌండ్‌లు, ఆరు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక ఐఈడీ, రెండు డిటోనేటర్లు, రెండు బండిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తో పాటు వైర్, 100 లీటర్ల నీటి ట్యాంకీ, రూ.64,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

"దేశద్రోహి, చైనీస్ ఏజెంట్": సంజయ్ రౌత్ పై భగ్గుమన్న కర్ణాటక సీఎం

కాగా.. ప్రాథమిక విచారణలో వారు గులాం మహ్మద్ మాలిక్ కుమారుడు, బుద్గామ్‌లోని గోగూ గ్రామంలో నివాసం ఉంటున్న అబ్ మజీద్ మాలిక్, అబ్దుల్ రషీద్ భట్ కుమారుడు, బండిపోరాలోని అలూసా గ్రామంలో నివసిస్తున్న సాహిల్ అహ్మద్ భట్‌ వివరాలను వెల్లడించారు. దీంతో వారిని కూడా పోలీసులు తరువాత అరెస్టు చేశారు.