Asianet News TeluguAsianet News Telugu

డ్రైనేజ్ పైపుల పని చేస్తుంటే కూలిన మట్టిపెళ్లలు.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి...

డ్రైనేజ్ పైప్ లైన్ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలు.. మట్టిపెళ్లలు విరగడంతో సజీవసమాధి అయిన ఘటన హర్యానాలో జరిగింది. ఈ ముగ్గురూ వలసకూలీలని బీహార్ కు చెందిన వారని తేలింది. 

3 Migrant Labourers Fitting Sewage Pipes Got Buried In Haryana
Author
First Published Dec 23, 2022, 7:30 AM IST

హర్యానా : హరియాణాలోని హిస్సార్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. హిస్సార్ జిల్లాలోని నార్నాండ్ సబ్ డివిజన్‌లోని కప్రో గ్రామంలో డ్రైనేజ్ పైపులు బిగించే సమయంలో.. బురద కారణంగా బీహార్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు గురువారం మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాప్రో గ్రామంలోని ఇంద్రజ్ పార్క్ సమీపంలో మురుగునీటి పైపులు బిగించే పని జరుగుతోందని, ఈ కూలీలు 10-12 అడుగుల దిగువన పనిచేస్తున్నారని నార్నాండ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వికాస్ యాదవ్ తెలిపారు.

పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టి కూలడంతో ముగ్గురు కూలీలు..అక్కడికక్కడే బురదలో కూరుకుపోయారు. ఇది గమనించిన అక్కడివారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు భారీ మట్టి తరలింపు యంత్రాల సాయంతో ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, బురదలో కూరుకుపోయి, ఊపిరి ఆడక ఆ ముగ్గురూ అప్పటికి చనిపోయారని తెలిపారు. మృతులను బీహార్‌కు చెందిన బల్జీత్, సంతోష్, సనోజ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

15యేళ్ల బాలిక కిడ్నాప్.. 35 యేళ్ల వ్యక్తికి అమ్మేస్తే.. అత్యాచారం, చిత్రహింసలు.. చివరికి రెండు నెలల తరువాత...

ఇలాంటి ఘటనే అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ లోని ఈటాలో బుధవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. బుధవారం కూలిన భారీ మట్టి పెళ్ల కింద ముగ్గురు పిల్లలు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలోని ఫకీర్‌పురా గ్రామంలో సచిన్, కౌశల్, గోవింద్ (12 సంవత్సరాలు)గా గుర్తించబడిన ముగ్గురు పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా మట్టి పెళ్లల కింద సజీవ సమాధి అయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. 

చిన్నారులు రోజూ వచ్చే సమయానికి పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులతో కలిసి వెతకగా, మట్టి పెళ్లల కింద పడి మృత్యువాత పడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుంది. మృతుల శవాలను శవపరీక్షకు తరలించారు. పోలీసు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇలాగే, సెప్టెంబరులో, ఇటావా జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్, ఇటావాలోని సివిల్ లైన్ ప్రాంతంలోని చంద్రపురా గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిపోవడంతో నలుగురు పిల్లలు మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారులను సింకు (10), అభి (8), సోను (7), ఆర్తి (5)గా గుర్తించగా, గోడ కూలిన ఘటనలో రిషవ్ (4), వారి అమ్మమ్మ శారదాదేవి (75) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లాకు చెందిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఇటావాలో గోడ కూలిన కారణంగా సంభవించిన మరణాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios