జమ్మూ కాశ్మీర్ లో ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. 

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బన్నీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తు లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొంది అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న థాయ్‌లాండ్‌లోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని నైట్‌క్లబ్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు అధికారులు సమాచారం తెలిపారు.

ఐదేళ్ల కూతురిని నాలుగో అంతస్తునుంచి పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

ఈ అగ్నిప్రమాదం సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ B నైట్‌క్లబ్‌లో జరిగింది. ఇది సుమారు 1:00 గంటలకు (1800 GMT గురువారం) ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన బాధితులందరూ థాయ్ జాతీయులని పోలీసు కల్నల్ వుట్టిపోంగ్ సోమ్‌జై టెలిఫోన్ ద్వారా తెలిపారు.