ఆలయంలోని నీటి ట్యాంకులో మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈరోజు చెన్నైలోని ఓ దేవాలయం వద్ద ఉన్న ట్యాంక్‌లో ఐదుగురు చిన్నారులు మునిగి మృతిచెందారు. ఇది స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్మకాండ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.