జార్ఖండ్‌లో మనిషి దంతాలతో చేప..

First Published 21, Jun 2018, 11:26 AM IST
fish have human teeth at jharkhand
Highlights

జార్ఖండ్‌లో మనిషి దంతాలతో చేప.. 

కొద్దిరోజుల క్రితం పక్షితలతో చేప కనిపించి చైనా జాలర్లతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. తాజాగా జార్ఖండ్‌లో మరో వింత జరిగింది.. అది కూడా చేప విషయంలోనే.. ఒక చేప మనిషి దంతాలతో కనిపించడం అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. పత్‌రాతూ డ్యామ్ సమీపంలోని పాలానీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చేపల వేటకు వెళ్లగా.. అతని గాలానికి చేప చిక్కింది..

విచిత్రంగా ఉన్న చేప ఆకారాన్ని చూసి ముందు భయపడిపోయాడు.. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు..  వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అలా విషయం ఆ నోటా ఈ నోటా చుట్టపక్కల గ్రామాలకు తెలియడంతో.. జనం తరిలివచ్చారు.. సమాచారం అందుకున్న జిల్లా మత్స్య శాఖ అధికారులు పాలానీ చేరుకున్నారు.. దీనిని చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదని... ఇది విషపూరిత జంతువు కాదని.. పాకూ జాతికి చెందిన చేప అని చెప్పారు.. 

loader