Asianet News TeluguAsianet News Telugu

దాల్ లేక్‌లో తేలియాడే థియేటర్.. పర్యాటకుల ఆకర్షణకు వినూత్న నిర్ణయం.. వీడియో ఇదే

జమ్ము కశ్మీర్‌ సహజ సౌందర్యానికి తోడు అధికారులు టూరిస్టు స్పాట్‌గా వెలుగొందుతున్న దాల్ లేక్‌లో తొలిసారిగా వినూత్నమైన తేలియాడే థియేటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు, టూరిస్టులు హర్షం వ్యక్తం చేశారు. శికారాల్లో దాల్ లేక్‌పై ప్రయాణిస్తూ బహిరంగ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ సినిమా చూడటం అద్భుతమైన అనుభూతి అని చెబుతున్నారు.

first floating theatre in dal lake in jammu kashmir
Author
Srinagar, First Published Oct 30, 2021, 4:49 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. 370 అధికరణం రద్దు తర్వాత కఠిన ఆంక్షలు అమలైన సంగతి తెలిసిందే. స్థానికులు ఇప్పుడిప్పుడే ఆంక్షల నుంచి బయటపడి స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. అన్ని వ్యవహారాలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్నాయి. Terroristm ముప్పు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్నా.. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రభుత్వ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నట్టు తెలుస్తున్నది.

Jammu Kashmir సహజంగా సుందరమైన ప్రదేశం. ఇక్కడికి ప్రపంచదేశాల నుంచి Visitors పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కరోనాతో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా టూరిజం సన్నగిల్లింది. Corona మహమ్మారి వెనుకపట్టు పట్టిన తరుణంలో అధికారులు మళ్లీ పర్యాటకం పుంజుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, కశ్మీర్‌లో ఫేమస్, ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న దాల్ లేక్‌కు మరో సొబగును దిద్దారు. దాల్ సరస్సులో వినూత్న తరహాలో తొలిసారి తేలియాడే థియేటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. జమ్ము కశ్మీర్ చీఫ్ సెక్రెటరీ అరుణ్ కుమార్ మెహతా ఈ Floating Theatreను ప్రారంభించారు.

Also Read: అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఫొటోగ్రాఫర్లకు స్వర్గాధామమని పిలిచే కశ్మీర్‌లో Tourismను పెంచే లక్ష్యంతో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సరస్సులో శికారాలు(పడవలు) ర్యాలీ చేశాయి. నెహ్రూ పార్క్ నుంచి కబూతార్ ఖానా వరకు లైట్లు వెలిగించారు. కళాకారులు పాడుతూ, కశ్మీరీ పాటలకు నాట్యమాడుతూ ర్యాలీ సాగింది. ఇదంతా స్థానికులు, అతిథులకు కనుల విందునిచ్చింది.

ఈ థియేటర్ ప్రారంభించిన తర్వాత తొలి చిత్రంగా కశ్మీర్ కీ కాలి అనే బాలీవుడ్ సినిమాను ప్రదర్శించారు. టూరిస్టులు, నివాసులు ఈ థియేటర్‌పై మనసుపారేసుకున్నారు. కశ్మీర్ కీ కాలి సినిమా చూస్తూ సంధ్యా సమయంలో బహిరంగంగా దాల్ లేక్‌పై సేదతీరారు. మధురక్షణాలను పొదివిపట్టుకున్నారు.

ఈ థియేటర్ పర్యాటకానికి ఊతమిస్తుందని జమ్ము కశ్మీర్ టూరిజం కల్చర్ శాఖ కార్యదర్శి సర్మద్ హఫీజ్ అన్నారు. సాయంత్రం పూట నిర్వహించే కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తున్నదని, సాయంత్రం పూట బహిరంగంగా పిల్లగాలులకు సేదతీరుతూ సినిమా చూడటం బహుశా ప్రపంచంలో ఇంకెక్కడ లేదని అన్నారు. కశ్మీర్ పర్యటనకు ఎంతో కొంత ఈ థియేటర్ ఉపకరిస్తుందని వివరించారు. ఇప్పటికే హోటల్ సిబ్బంది, శికారా నడిపేవారందరికీ టీకా పంపిణీ పూర్తయిందని తెలిపారు. కాబట్టి, పర్యాటకంపై కరోనా ప్రభావముండదని భావిస్తున్నట్టు చెప్పారు. స్థానికులు టూరిస్టులు ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. 

Also Read: భవిష్యత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలుస్తుంది: వైమానిక దళ సీనియర్ అధికారి

ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచివని, ఇవి ఇలాగే కొనసాగిస్తుంటే కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని బిలాల్ అహ్మద్ అనే పడవ యజమాని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు కశ్మీర్ పర్యటించి ఆనందంగా గడపాలని సూచించారు. 

‘నేను శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళుతున్నప్పుడు.. ఈ సీజన్‌లో మొదటి హిమపాతం‌తో పీర్ పంజాల్ పర్వత శ్రేణి (Pir Panjal mountain range) యొక్క ఈ బ్రీత్ టేకింగ్ పిక్చర్స్‌ను క్యాప్చర్ చేశాను. భారతదేశ కిరీటంలో ఆభరణమైన కాశ్మీర్ పర్యాటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. భారతదేశంలోని ఈ అందమైన ప్రాంతాన్ని సందర్శించండి’ అని అమిత్ షా పేర్కొన్నారు. #IncredileIndia అనే ట్యాగ్‌ను కూడా షా ఇటీవలే ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios