Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. కర్కర్‌దూమా హోటల్ లో చెలరేగిన మంటలు.. ఘటనా స్థలానికి చేరుకున్న 9 ఫైర్ ఇంజన్లు

ఢిల్లోని ఓ హెటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనంలోని మూడో అంతస్తులో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Fire in Delhi.. Fire broke out in Karkarduma hotel.. 9 fire engines reached the scene.
Author
First Published Dec 5, 2022, 12:11 PM IST

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కర్కర్‌దూమాలో ఉన్న ఓ హోటల్ లోని మూడో అంతస్తులో సోమవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందడంతో 9 ఫైర్ ఇంజన్లు హుటా హుటిన 9 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మరో వైపు అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

మా సంబంధానికి అడ్డురావొద్దు.. అంటూ ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు....

ఈ అగ్నిప్రమాద సమయంలో హోటల్ లోపల ఉన్న వ్యక్తులు ఫైర్ ఎస్కేప్ ద్వారా బయటకు వచ్చారు. పలు మీడియా సంస్థలు విడుదల చేసిన వీడియోల్లో వారి కదలిక కనిపిస్తోంది. ఆ వీడియోలో  ఓ వ్యక్తి హోటల్ రెస్టారెంట్ కిటికీని పగలగొడుతున్నారు. ఊపిరాడకుండా చేసే దట్టమైన పొగమంచు కూడా ఆ ఆవరణలో పేరుకుపోయింది.

పెళ్లికి బైక్ మీద కుక్కతో వచ్చిన వరుడు... ఫోటో వైరల్..!

ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ అగ్నిప్రమాదంలో ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు రెండు అగ్నిమాపక రోబోలను మొదటిసారిగా రంగంలోకి దించారు. ఇవి ఇరుకైన మార్గాల్లో కూడా ప్రయాణించగలవు. మనుషులు ప్రవేశించలేని ప్రదేశాలకు కూడా చేరుకుంటాయి. మనుషులు చేయలేని అనేక ప్రమాదకరమైన పనులను కూడా చేయగలవు. 

‘‘ఈ రోబోలు నిమిషానికి 2,400 లీటర్ల చొప్పున హై ప్రెజర్ తో నీటిని విడుదల చేస్తాయి. ఈ రోబోట్‌కు అటాచ్ చేసిన వైర్‌లెస్ రిమోట్ నీటి స్ప్రేను కంట్రోల్ చేసే సామర్థ్యం ఉంటుంది.’’అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక అధికారి తెలిపారు. త్వరలో మరో నాలుగు అగ్నిమాపక రోబోలను ఫ్లీట్‌లో చేర్చనున్నట్లు అధికారి తెలిపారు.

మహాకాల్ ఆలయంలో మహిళల డ్యాన్స్ వీడియో వైరల్... ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది సస్పెండ్..

ఇరుకైన సందులలో సులభంగా ప్రవేశించి సత్వరమే పనిని ప్రారంభించే బైక్, ఎస్ యూవీలను కూడా ఇటీవల ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రారంభించింది. ఈ బైక్‌లను అంబేద్కర్ నగర్, చాందినీ చౌక్, సబ్జీ మండి, ఘంటా ఘర్, పహర్‌గంజ్, షీలా సినిమా, గాంధీ నగర్‌లలో మోహరిస్తారు. అయితే అగ్నిమాపక ఎస్ యూవీ లు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, గీతా కాలనీలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios