Fire in Dal Lake : కాశ్మీర్ లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. ముగ్గురు బంగ్లాదేశీ పర్యాటకులు మృతి
జమ్మూ కాశ్మీర్ లోని దాల్ సరస్సు సమీపంలో శనివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు బంగ్లాదేశీయులు చనిపోయారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Fire in Dal Lake : జమ్మూ కాశ్మీర్ లోని ప్రఖ్యాత దాల్ సరస్సులోని హౌస్ బోట్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు పర్యాటకులు సజీవ దహనమయ్యారు. వీరిని అనిందాయ కౌషాల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. వీరంతా బంగ్లాదేశ్ కు చెందిన వారని, మంటల్లో దగ్ధమైన హౌస్ బోట్ సఫీనాలో వారు ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఇద్దరు బాలికలతో పరిచయం.. మార్ఫింగ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం..
కాగా.. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పై సమాచారం అందిన వెంటనే శ్రీనగర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, టూరిస్ట్ పోలీసులు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెంటనే అక్కడికి చేరుకున్నాయి. స్థానికుల సాయంతో ఈ టీమ్ లన్నీ ఎనిమిది మందిని రక్షించాయి.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, ఆర్ఎం బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసులు తెలిపారు. ఐదు హౌస్ బోట్లు, వాటికి అనుబంధంగా ఉన్న గుడిసెలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. శనివారం తెల్లవారు జామున 5.15 గంటల ప్రాంతంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా.. డీఎన్ఏను సరిపోల్చిన తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.
కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చండి - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై మండిపడ్డ ఓవైసీ
దాల్, నిగీన్ సరస్సుల్లో లంగరు వేసిన హౌస్ బోట్లలో జరిగిన అతి పెద్ద రెండో ప్రమాదం ఇది. గతేడాది ఏప్రిల్ లో నగర శివార్లలో విదేశీ పర్యాటకులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన నిగీన్ సరస్సులో కూడా ఇలాంటి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు హౌస్ బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.