కేరళకు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు.. అబుదాబిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
టేకాఫ్ అయిన తరువాత ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం అబుదాబి నుంచి కేరళకు వస్తోంది.

అబుదాబి నుండి కేరళలోని కాలికట్ వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బీ737-800 విమానం గాలిలో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో దానిని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘనటలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఆ విమానంలో ఉన్న ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వర్గాలు వెల్లడించినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. టేకాఫ్ తీసుకుని 1,000 అడుగుల ఎత్తుకు ఎక్కిన కొద్దిసేపటికే ఒక ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో పైలట్ తిరిగి అబుదాబి విమానాశ్రయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కి తెలిపింది.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న బీ737-800 విమానం 1000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మంటల చెలరేగాయి. విమానంలో మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన పైలట్ వెంటనే అబుదాబిలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే ఆ సమయంలో విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు.
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
కాగా.. 2022 డిసెంబర్ ఇదే ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించింది. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విమాన ప్రమాదాల ఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్ వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో వెనక్కి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం కూడా లక్నో నుంచి కోల్‌కతా వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం నుంచి పక్షి ఢీకొనడంతో ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విస్తారా ఫ్లైట్ కూడా ఇలాగే ల్యాండ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. జనవరి 30వ తేదీన కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమతమైన పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు షార్జా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విమానాన్ని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 193 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారు.