Asianet News TeluguAsianet News Telugu

గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు..

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. గడ్చిరోలిలోని అహేరి తహసీల్‌లోని వేడంపల్లి అటవీ ప్రాంతంలో  ఈ ఘటన  చోటుచేసుకుంది.

 fire exchange between police and maoists in gadchiroli
Author
First Published Jan 16, 2023, 11:36 AM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. గడ్చిరోలిలోని అహేరి తహసీల్‌లోని వేడంపల్లి అటవీ ప్రాంతంలో  ఈ ఘటన  చోటుచేసుకుంది. పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు నక్సలైట్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారు. అయితే పోలీసుల నుంచి ఎదురు దాడి ఎక్కువగా ఉండటంతో.. 20 నుంచి 25 మంది వరకు మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు.  ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. కొన్ని ఆయుధాలు, మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నక్సలైట్లు మెరుపుదాడికి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios