Gujarat: సూరత్‌లోని ఓ టెక్స్‌టైల్ మిల్లులో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు  20 అగ్నిమాపక యాంత్రాల‌తో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మిల్లు నగరంలోని పండేసరా ప్రాంతంలో ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. 

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో (Surat) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్‌టైల్‌ మిల్లులో శనివారం అర్థ‌ రాత్రి మంటలు అంటుకున్నాయి. క్రమంగా ఆ మంట‌లు మిల్లు మొత్తానికి వ్యాపించాయి. భారీ ఎత్తున మంట‌లు ఎగిసి ప‌డటంతో స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచార‌మందించారు. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది 20 అగ్నిమాపక యంత్రాలతో రంగంలో దిగారు. మంట‌లు అదుపులోకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ఈ స‌మ‌యంలో అగ్నిమాపక అధికారి ఫల్గుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 20 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు.

పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ..

ఇదిలా ఉంటే.. శనివారం తెల్లవారుజామున గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్‌లో ఇద్దరు కూలీలు ఊపిరాడక మరణించారు. సాధారణ వ్యర్థాలను శుద్ధి చేయడం, నిల్వ చేయడం, పారవేయడంలో పాలుపంచుకున్న ఎకో కేర్ అనే కంపెనీ యూనిట్‌లో ఈ సంఘటన జరిగిందని పట్టి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. 

పోలీసు అధికారుల క‌థ‌నం ప్రకారం.. ఫ్యాక్టరీలోని ట్యాంక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఒక కార్మికుడు స్పృహతప్పి పడిపోయాడు, ఆ తర్వాత అతన్ని బయటకు తీయడానికి మరొక కార్మికుడు ట్యాంక్‌లోకి ప్రవేశించాడు. అయితే ఊపిరాడక ఇద్దరూ చనిపోయారు.

గత నెలలో గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలిపోయింది. శిథిలాల కింద పడి దాదాపు 12 మంది కూలీలు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. హల్వాద్ జిఐడిసిలో ఉన్న సాగర్ సాల్ట్ అనే ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.