భారతీయ రైల్వేలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వల్సాద్‌లోని హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది.

భారతీయ రైల్వేలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వల్సాద్‌లోని హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుచిరాపల్లి నుంచి శ్రీగంగానగర్‌కు వెళ్తుండగా వల్సాద్ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలులోని జనరేటర్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను కిందకు దించారు. 

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రైలు పవర్ కార్/బ్రేక్ వ్యాన్ కోచ్‌లో మంటలు, పొగ కనిపించిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పక్కనే ఉన్న కోచ్‌లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం మంటలు అదులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు.