ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల ఓ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న భీముండే‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ప్రమాదంలో భవనంలోని పై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె నివాసం కూడా ఉంది. ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. సహాయక సిబ్బంది 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.