ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో సోమవారం మంటలు చెలరేగాయి.

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ రూమ్ సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రోగులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక, ఎయిమ్స్ భవనంలోని రెండో అంతస్తులో దట్టమైన మంటలు, పొగ వెలువడుతున్నట్టుగా కనిపిస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.