హత్య కేసులో సాక్షుల ఫొటోలను తన లాయర్ ను అడగడం, సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీని గురువారం అజంగఢ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

అజంగఢ్ : గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీపై గురువారం పోలీసు మరో కేసు నమోదు చేశారు. హత్య కేసు వర్చువల్ హియరింగ్ లో సాక్షిని బెదిరించాడని ఆయన మీద పోలీసు కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన సాక్షులను బెదిరించేందుకు గానూ అన్సారీ తన న్యాయవాది నుంచి వారి ఫోటోలను కోరడం రికార్డయ్యింది. 

2014లో బీహార్‌కు చెందిన కార్మికుడిని హత్య చేసిన కేసులో ముఖ్తార్ అన్సారీపై అజంగఢ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో విచారణ జరుగుతోంది. ఫిబ్రవరి 6, 2014న బీహార్‌లోని తర్వాన్‌లోని ఐరా కాలా గ్రామంలో రామ్ ఇక్బాల్ అనే కార్మికుడు కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో ముఖ్తార్ అన్సారీతో పాటు మరో 10మందిపై అభియోగాలు మోపారు. దీంతోపాటు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదయ్యింది. హత్య కుట్రకు సంబంధించిన అదనపు ఆరోపణలను కూడా అన్సారీ ఎదుర్కొన్నారు.

ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు.. ఎవ‌రీ అవధేష్ రాయ్? హత్య కేసు వివ‌రాలు ఇవే..

ఈ కేసులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరుగుతున్న సమయంలో, అన్సారీ తన లాయర్‌ను ఈ కేసులోని సాక్షులకు సంబంధించిన ఫొటోలు కావాలని అడిగారు. వారిని బెదిరించాలనే ఉద్దేశ్యంతో వారి ఫోటోలను అడిగారు. అందులో భాగంగానే ఈ కేసులోని సాక్షుల్లో ఒకరికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 కింద అన్సారీపై పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ ఆర్య గురువారం ఫిర్యాదు చేశారు. అన్సారీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అన్సారీ ఇప్పటికే మరో రెండు కేసుల్లో విచారణలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ ఆర్య మాట్లాడుతూ.. "వెల్ నోటెడ్ ఐఎస్ 191 గ్యాంగ్ నాయకుడు మాఫియా లీడర్ ముఖ్తార్ అన్సారీ కోర్టులో కొనసాగుతున్న కేసులో సాక్షిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ సమాచారం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. దీనిమీద విచారణ జరుగుతోంది" అన్నారు.

“సాక్షుల పూర్తి భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌ను సులభతరం చేయడానికి, ఈ మాఫియా నాయకుడిపై పెండింగ్‌లో ఉన్న కేసులలో త్వరగా న్యాయం చేయడానికి, ప్రత్యేక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశాం”అన్నారాయన.