Bharti Singh Controversy: ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గడ్డం, మీసాలపై హేళన చేశారంటూ.. సిక్కు సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అంతకు ముందు బహిరంగంగా క్షమపణ కోరిన ఫలితం లేకుండా పోయింది.
Bharti Singh Controversy: కమెడియన్ భారతీ సింగ్ చిక్కుల్లో పడ్డారు. గడ్డం, మీసాలపై ఇచ్చిన స్టేట్‌మెంట్..ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి దారితీసింది. ఆమెపై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదైంది. తన చేసిన కామెంట్ వివాదానికి దారి తీయడంతో భారతి క్షమాపణలు చెప్పినా.. సిక్కు సంఘం ఆగ్రహం చల్లారకపోవడంతో ఇప్పుడు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
హాస్యనటుడు భారతీ సింగ్‌పై పోలీసులు ఐపిసి సెక్షన్ 295-ఎ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె SGPC ఎఫ్‌ఐఆర్‌నుదాఖలు చేసింది. మీసాలు, గడ్డం అంటూ భారతి జోక్ చేయడంతో సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో గడ్డం మీసాల గురించి భారతి చేసిన వ్యాఖ్యపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
భారతి ఓ కామెడీ షోలో గడ్డం, మీసాలపై జోక్ చేసింది. దీనిపై సిక్కు సమాజానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె కూడా ట్రోల్‌కి గురయ్యాడు. ఈ విషయంపై అమృత్‌సర్‌లోని సిక్కు సంస్థలు భారతీ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. విషయం తీవ్రస్థాయికి చేరడంతో.. ఆమె సోషల్ మీడియా వేదికగా.. చేతులెత్తి (ముకుళిత హస్తాలతో) సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పారు. అయినా.. భారతీ సింగ్ వ్యాఖ్యలపై సిక్కు కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని SGPC అధికార ప్రతినిధి తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. హాస్యనటి భారతీ సింగ్.. సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
భారతి కామెడీ షోలో టీవీ నటి జాస్మిన్ భాసిన్ అతిథిగా కనిపించింది. జాస్మిన్‌తో భారతి సరదాగా మాట్లాడుతూ.. గడ్డం, మీసాలు ఎందుకు అవసరం లేదని, పాలు తాగి గడ్డం నోటిలో పెట్టుకుంటే వెర్మిసెల్లి వాసన వస్తుందనీ, తన పెళ్లయిన చాలా మంది స్నేహితులు రోజంతా తమ గడ్డం, మీసాల నుంచి పేన్లు తీయడంతో బిజీబిజీగా ఉన్నారని, వారి తమ జీవితాన్ని అలాగానే గడిపేస్తుంటారని చమత్కరించింది. ఈ వ్యాఖ్యలపై వివాదం నెలకొంది.
భారతి క్షమాపణలు చెప్పారు
తన వ్యాఖ్యలపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో భారతీ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసింది. వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పింది. భారతి మాట్లాడుతూ, 'నాకు సంబంధించిన వీడియో చాలా వైరల్ అవుతోంది. ప్రజలు నన్ను గడ్డం , మీసాల గురించి జోక్ చేశారా అని అడుగుతున్నారు. రెండు రోజులుగా ఆ వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నాను మీరు కూడా ఆ వీడియో చూడమని అడుగుతాను.
తాను ఏ మతం లేదా ఏ కులం గురించి మాట్లాడలేదనీ, గడ్డం పెట్టుకుని ఇబ్బంది పడతారని పంజాబీలకు చెప్పలేదనీ, తాను సాధారణంగా మాట్లాడననీ, నా స్నేహితుడితో కలిసి కామెడీ చేసేదాన్ని. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గడ్డం, మీసాలు పెంచుతున్నారు. కానీ తన మాటలు ఏ మతానికి చెందిన వారినైనా నొప్పించి ఉంటే.. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాననీ. తాను కూడా ఓ పంజాబీనేనీ. తాను అమృత్‌సర్‌లో పుట్టాననీ.. పంజాబీని అని గర్విస్తున్నానని చెప్పుకోచ్చారు.
