JammuKashmir: సంఘ్ ఆదర్శవేత్త పీ.పరమేశ్వరన్ స్మారకార్థం భారతీయ విచార కేంద్రం నిర్వహించిన "సహకార ఫెడరలిజం: ఆత్మ నిర్భర్ భారత్ వైపు మార్గం" అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోద పునరుద్దరణ గురించి మాట్లాడారు.
Finance Minister Nirmala Sitharaman: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయబడి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన మూడేళ్ల తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర-రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ ఆదర్శవేత్త పీ.పరమేశ్వరన్ స్మారకార్థం భారతీయ విచార కేంద్రం నిర్వహించిన "సహకార ఫెడరలిజం: ఆత్మ నిర్భర్ భారత్ వైపు మార్గం" అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోద పునరుద్దరణ గురించి మాట్లాడారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రాష్ట్రాలకు నిధుల పంపిణీపై మాట్లాడుతుండగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2014-15లో 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసును ప్రధాని నరేంద్ర మోడీ ఏ మాత్రం సంకోచించకుండా ఆమోదించారనీ, అప్పటి వరకు 32 శాతం నుంచి 34 శాతం పన్నులను రాష్ట్రాలకు పెంచాలని సూచించారన్నారు.
"ఆ ఫైనాన్స్ కమీషన్ ఇప్పుడు మీరు దానిని 42 శాతానికి పెంచండి.. అంటే కేంద్రం చేతిలో తక్కువ మొత్తం ఉంటుందని అర్థం. ప్రధాని మోడీ దాని గురించి రెండవ ఆలోచన లేకుండా ఫైనాన్స్ కమిషన్‌ను పూర్తిగా అంగీకరించారు. అందుకే నేడు, రాష్ట్రాలు మొత్తంలో 42 శాతం పొందుతున్నాయి. అయితే, జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం కాదు కాబట్టి ఇప్పుడు 41 శాతంకు తగ్గించబడిందని" అన్నారు. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ త్వరలోనే రాష్ట్ర హోదా పొందుతుందనీ పేర్కొన్న మంత్రి.. దీనికి మరింత సమయం పడుతుందని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఆగస్టు 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీని కారణంగా జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదా కొల్పోవడంతో పాటు రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, స్థానికేతరులను ఓటర్ల జాబితాలో చేర్చే అంశంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, అనేక ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) చైర్మన్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఇదే విషయంపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
