కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆమె ఈ రోజు డిశ్చార్జ్ అయినట్టు హాస్పిటల్ వర్గాలు వివరించాయి. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ లక్షణాలతో ఆమె సోమవారం హాస్పిటల్‌లో చేరారు. ఆమెను ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసుకుని ఓ ప్రైవేట్ వార్డుకు షిఫ్ట్ చేసినట్టు హాస్పిటల్ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని ఆ వర్గాలు తెలిపాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించిన‌ట్టు స‌మాచారం. 

Scroll to load tweet…

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన ప్రసంగంలో ‘ఇప్పుడు పప్పు ఎవరు’ అని పార్లమెంటులో ప్రసంగించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పప్పును కనుగొనడానికి మొయిత్రా తన పెరట్లో మాత్రమే చూడాలని సీతారామన్ అన్నారు. లోక్‌సభలో అదనపు గ్రాంట్‌పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ.. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి నుంచి తగ్గిందని, దీనిని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.

ప్రియుడితో పారిపోయిన మొదటి భార్య కోసం.. రెండో భార్యను పాముతో కరిపించి..విషం ఇంజక్షన్ ఇచ్చి...చివర్లో ట్విస్ట్

“నవంబర్ 2022కి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.8 శాతంకు తగ్గింది. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం.’’ అని ఆమె ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2013లో ద్రవ్యోల్బణం 19.33 శాతంగా ఉందని చెప్పారు.