Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : అప్పు తిరిగివ్వమన్నందుకు, టీచర్ సజీవదహనం.. కాపాడే ప్రయత్నం చేయకుండా, వీడియోలు తీసిన స్థానికులు...

అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు.. ఓ ఉపాధ్యాయురాలిమీద దాడిచేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన జైపూర్ లో జరిగింది.

Female teacher set on fire in Jaipur, locals take videos instead of saving her
Author
hyderabad, First Published Aug 17, 2022, 4:17 PM IST

జైపూర్ : మానవత్వం మంటగలిసే ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో వెలుగుచూసింది. ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే ఓ మహిళను సజీవదహనం చేసినా.. ఆమెను రక్షించాల్సింది పోయి.. వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన ఏడు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయిన మహిళ ఉపాధ్యాయురాలని తెలుస్తోంది. వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని ఒక గ్రామంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 

32 ఏళ్ల మహిళకు నిందితులు నిప్పటించి, సజీవదహనం చేసే ప్రయత్నం చేశారు. ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తరువాత మరణించింది. ఆమె ఉపాధ్యాయురాలని, ఆమె తన కొడుకుతో కలిసి ఆగస్టు 10 న పాఠశాలకు వెళ్తుండగా నిందితులు ఆమెపై దాడి చేశారని తెలిసింది. వారు ఆమె మీద దాడి చేసి చేశారు. ఆమె వారినుంచి తప్పించుకున్న అదే కాలనీలోని ఓ ఇంటిలోకి వెళ్లి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె 100 నంబర్‌కు ఫోన్ చేసి తాను ఎక్కడుందో.. తనమీద ఎలాంటి దాడి జరుగుతుందో చెప్పింది. కానీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. 

లేడీస్ హాస్టళ్లో విద్యార్థినులతో సెక్యూరిటీ గార్డ్ వికృతచేష్టలు.. తాగినమత్తులో హల్ చల్...

ఈ క్రమంలోనే నిందితులు బాధితురాలిని పట్టుకుని.. ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఇదంతా చూస్తున్న స్థానికులు మాత్రం ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. పైగా వీడియోలు తీస్తూనే ఉన్నారు, ఆమె మంటల వేడికి తట్టుకోలేక బాధతో కేకలు వేస్తున్నా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. అయితే, ఇలా జరగడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. స్థానికుడైన భాస్కర్ కథనం ప్రకారం, బాధితురాలు నిందితుడికి డబ్బు అప్పుగా ఇచ్చింది. అయితే ఎంతకాలానికీ వాపసు ఇవ్వకపోవడంతో... డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది. అలా అడిగిందని ఇంత దారుణానికి ఒడిగట్టారు.

అంతకు ముందు ఓసారి కూడా డబ్బులు ఇవ్వమని అడుగుతుందని దాడికి ప్రయత్నించగా.. ఆమె వారిపై మే 7 న కేసు కూడా నమోదు చేసింది. అయినా వారిపై చర్యలు లేకపోవడంతో.. ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. 70% కాలిన గాయాలతో బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు రోుల పాటు చికిత్స పొందింది. తరువాత జైపూర్‌లోని SMS ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఏడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది. కొందరు పోలీసులు నేరగాళ్లతో కుమ్మక్కయ్యారని, అందుకే వారి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె భర్త ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios