Asianet News TeluguAsianet News Telugu

బంధువుల పెళ్లికి తీసుకెళ్లి, కూతురి మీద అత్యాచారం చేసి, పరారైన తండ్రి...

ఓ కీచక తండ్రి కన్న కూతురిమీదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ.. మార్గమధ్యంలో కూతురి మీద అత్యాచారం చేసి, పారిపోయాడు. 

Father rapes minor daughter and flees in rajasthan - bsb
Author
First Published Jun 8, 2023, 11:22 AM IST

రాజస్థాన్ : రాజస్థాన్ లోని దుంగార్‌పూర్ జిల్లా, బిచివారా ప్రాంతంలో మైనర్ బాలికపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మే 29న బాలిక తల్లి బిచ్చివార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓ వివాహ వేడుకకు హాజరైన బాలిక బంధువుల ఇంటి నుంచి తండ్రితో కలిసి ఇంటికి వస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. 

తన భర్త గుజరాత్‌లో కూలీగా పనిచేస్తున్నాడని, తన కూతురు బిచివారాలో తనతో ఉంటోందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మే 29న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు నిందితుడు గ్రామానికి వచ్చాడు. కూతురితో కలిసి వేడుకకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా, అతను ఒక నిర్జన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశాడు.

చిన్న విషయాలకే తరచూ అవమానిస్తోందని భార్యపై కాల్పులు జరిపిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్.. ఎక్కడంటే ?

ఆ తరువాత ఆమెను అక్కడికక్కడే ఒంటరిగా వదిలి పారిపోయాడు. బాలిక అక్కడినుంచి ఎలాగో ఇంటికి చేరుకోగలిగింది. విషయాన్ని తల్లితో చెప్పడంతో.. దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఓ కన్న తండ్రి కసాయిలా మారాడు.. కామాంధుడై కూతురి మీదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ కీచక  తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.  డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి (37) కూతురు ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటుంది. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి ఆమె మీద కన్నేసాడు. కొద్ది రోజులుగా కుమార్తపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా తెలిసింది. 

ఆ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో.. తట్టుకోలేని బాధితురాలు తిరుచెంగొడు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీని మీద వెంటనే విచారణ చేపట్టారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామాంధుడైన తండ్రిని అరెస్టు చేశారు. కామాంధుడైన ఆ తండ్రిని అరెస్టు చేశారు. అతను జైలుకు పంపించినట్లుగా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే వరంగల్ లో వెలుగు చూసింది. వరంగల్ లో  ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడో కామాంధుడైన తండ్రి. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్‌ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యలు గర్బవతి అని చెప్పడంతో..  ఘటన వెలుగులోకి వచ్చింది.

మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గత నెల రోజులుగా మైనర్‌ అయిన కూతురు మీద పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తల్లి తన బిడ్డను గట్టిగా ప్రశ్నించగా ఆమ అసలు విషయం తెలిపింది.తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు  తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వెల్లడించింది.

ఈ లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే.. మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, భయపడి ఎవ్వరికీ చెప్పలేదని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని మీద  ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ కీచకతండ్రిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios