సోదరిపై అత్యాచారయత్నం చేసిన మైనర్ బాలుడు, గన్ తో కాల్చి చంపిన తండ్రి

First Published 11, Jul 2018, 4:57 PM IST
Father kills son for attempting to rape sister
Highlights

వావి వరసలు మరిచి వరసకు చెల్లెలయ్యే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడో మైనర్ బాలుడు. అయితే ఈ విషయం తెలిసి ఆవేశంతో ఊగిపోయిన బాలుడి తండ్రి కన్న కొడుకని కూడా చూడకుండా గన్ తో కాల్చి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. 

వావి వరసలు మరిచి వరసకు చెల్లెలయ్యే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడో మైనర్ బాలుడు. అయితే ఈ విషయం తెలిసి ఆవేశంతో ఊగిపోయిన బాలుడి తండ్రి కన్న కొడుకని కూడా చూడకుండా గన్ తో కాల్చి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఇంద్రజిత్(38) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి కొడుకు రాజ్ వీర్(16) తరచూ అశ్లీల వీడియోలు చూస్తూ తన బాబాయ్ కూతురిని లైంగికంగా వేధించేవాడు. అయితే అన్నయ్యే ఇలా చేస్తున్నాడని చెబితే ఎవరూ నమ్మకపోగా పరువు పోతుందని ఈ విషయాన్ని బాలిక ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది.

దీన్ని అదునుగా భావించిన రాజ్ వీర్ బాలికను తరచూ వేధిస్తుండేవాడు. దీంతో గత నెల 25 న మరోసారి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఏకంగా ఈసారి బాలికను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతడి నుండి తప్పించుకున్న బాలికి నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని పెదనాన్న ఇంద్రజిత్ కు తెలియజేసింది.

దీంతో కోపాన్ని ఆపులేకపోయిన తండ్రి కొడుకుపై గన్ తో కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల్లో రాజ్ వీర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారు.   

అయితే ఇటీవలే కాలిపోయిన శవం ఒకటి కనిపించిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆ శవం ఇంద్రజిత్ కొడుకు రాజ్ వీర్ దిగా తెలిసింది. దీంతో కుటుంబసభ్యులను విచారించగా అసలు నిజాన్ని బైటపెట్టారు. పరువు కాపాడుకునేందుకే తాను కుమారుడిని చంపేసినట్టు ఇంద్రజిత్ అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
 

loader