చిరుతిళ్లు కొనిపెట్టమన్నందుకు కొడుకును చంపిన తండ్రి

father kills son at newdelhi
Highlights

మద్యం మత్తులో దారుణం

తినడానికి ఏమైనా కొనిపెట్టమన్నందుకు ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హతమార్చాడు. చిన్న పిల్లాడు మారాం చేస్తే బుజ్జగించాల్సిన ఈ కసాయి తండ్రే చిన్నారిని చిదిమేశాడు. ఓ బ్రిడ్జిపైనుంచి కొడుకుని నీళ్లలోకి విసిరేయడంతో ఊపిరాడక చిన్నారి బాలుడు చనిపోయాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సౌత్ ఈస్ట్ డిల్లీకి చెందిన సంజయ్ అల్వీ తన కుమారుడిని తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే అయాన్ రోడ్డుపై ఓ మామూస్ లు విక్రయించే దుకాణాన్ని అవి కొనిపెట్టమని తండ్రికి కోరాడు. దీనికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఏడుస్తూ మారాం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్ తన కొడుకు అయాన్ ను రోడ్డుపక్కన వున్న కేనాల్ లో పడేశాడు.

బాబును కునాల్ లో పడేస్తుండగా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు సంజయ్ అల్వీని అదుపులోకి తీసుకొన్నారు. బాలుడిని వెతికేందుకు కొంతమంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

 అయితే నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీస్ అధికారులు తెలిపారు. తన కొడుకు ఎదురుగానే మద్యం సేవించిన అల్వీ ఆ మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. మెడికల్ రిపోర్డులోనూ ఇదే విషయం బైటపడిందని  పోలీసులు తెలిపారు. దీంతో ఇతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కస్టడీకి పంపారు. 
 

loader