Asianet News TeluguAsianet News Telugu

తాగి వచ్చి, కన్న కూతుళ్లపైనే లైంగింక వేధింపులు.. కుమార్తెల ముందే తండ్రిని చంపిన దుండగులు...

దీపక్ కుమార్ గత ఏడాదిన్నరగా తన కూతుళ్లను Sexually harassing చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇద్దరు యువతులూ తన తల్లితో పాటు కళాశాలలోని మిత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు కూడా దీపక్ కుమార్ సింగ్ తాగి వచ్చి కూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో దీపక్ హత్య వెనుక ఆయన కుమార్తెలు చదువుతున్న కళాశాల స్నేహితులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

father killed in front of his two daughters over Sexually harassment suspicious in bangalore
Author
Hyderabad, First Published Nov 23, 2021, 2:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో దారుణం వెలుగు చూసింది. నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తన ఇద్దరు కూతుళ్ల కళ్లముందే అతి కిరాతకంగా murder చేశారు. బీహార్ కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46).. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్థరాత్రి నలుగురు Thugs దీపక్ ఇంట్లోకి చొరబడి ఆయన ఇద్దరు కూతుళ్లు చూస్తుండగానే ఆయుధాలతో 
Attack చేసి కిరాతకంగా చంపారు. 

అయితే, దీపక్ కుమార్ గత ఏడాదిన్నరగా తన కూతుళ్లను Sexually harassing చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇద్దరు యువతులూ తన తల్లితో పాటు కళాశాలలోని మిత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు కూడా దీపక్ కుమార్ సింగ్ తాగి వచ్చి కూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో దీపక్ హత్య వెనుక ఆయన కుమార్తెలు చదువుతున్న కళాశాల స్నేహితులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలా ఉండగా.. తమిళనాడులో నిన్నా, ఇవ్వాళ దుండగులు రెండు హత్యలకు పాల్పడ్డారు. తనిఖీల్లో ఉన్న Motor Vehicle Inspector (ఎంవీఐ)ను వాహనంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన కరూర్ లో సోమవారం ఉదయం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తంచిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కరూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గాKanakaraj పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద Inspection of vehiclesలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టి వెళ్లి పోయింది. మొదట దీనిని Accidentగా భావించారు. 

గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మరణించారు. రంగంలోకి దిగిన కరూర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. ఓ వ్యాన్ మహిళలను ఎక్కించుకుని అతి వేగంగా వెళ్లడాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఓ Textile companyకు చెందిన వ్యాన్ అధిక లోడింగ్ తో వెళ్తూ, ఆపేందుకు యత్నించిన కనకరాజ్ ను ఢీ కొట్టి వెళ్లినట్టు తేలింది. 

భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు నేలమట్టం.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు

వ్యాన్ ను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న Driver కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. 

మరో కేసులో నిన్న, చెన్నై, తిరుచ్చిలో Goat thieves వీరంగం సృష్టించారు. తమ సహచరులను ఛేజ్ చేసి.. పట్టుకునేందుకు వచ్చిన Special SIను దారుణంగా హతమార్చారు. ఈ దాడితో నిజాయితీ పరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ ను డిపార్ట్ మెంట్ కోల్పోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన వివరాలు విన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి Ex Gracia ప్రకటించారు. 

తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్ఐగా భూమినాథన్ (51) పనిచేస్తున్నారు. భార్య కవిత (46), కుమారుడు గుహనాథన్ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలయు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ చిత్రై వేల్ తో కలిసి గస్తీలో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios