కొచ్చి: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నకూతుళ్లపై తల దించుకునేలా వ్యవహరించాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు నలుగురు కూతుళ్లపై ఓ తండ్రి అత్యాచారం చేశాడు. బాలికలంతా మైనర్లే. చివరకు అతను కటకటాల పాలయ్యాడు.

కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 47 ఏళ్ల ఓ వ్యక్తి కేరళలోని వాంచేరీలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతనికి 17, 15, 13, 10 ఏళ్ల వయస్సు గల నలుగురు కూతుళ్లు ఉన్నారు.

Also Read: కూతురిపై తండ్రి అత్యాచారం: గొలుసులతో కట్టేసి మరీ, అఘాయిత్యం

కూలీ పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. కన్న కూతుళ్లు అనే విషయం కూడా విస్మరించి కళ్లు మూసుకుపోయి వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని చిన్న కూతురు పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

దాంతో నలుగురు బాలికలను వైద్య పరీక్షలకు పంపించారు. వారు లైంగిక దాడికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం