యూపీలో ఘోర రోడ్డు దేవా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్ ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా వచ్చి వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇందులో బాధితులంతా ఓ వివాహ వేడుకకు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్నారని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్తాన్‌లో కూలిన మిగ్-21 యుద్ద విమానం.. ఇంటిపై పడటంతో ఇద్దరు మృతి.. (వీడియో)
హర్దోయ్ ప్రాంతానికి చెందిన బైజ్ నాథ్ (45), చంద్రప్రభ (40), సత్యేంద్ర (42), ఆరాధ్య (92), కమలేష్ (46)లు మరో ముగ్గురితో కలిసి ఓ వ్యాన్ లో బారాబంకీ ప్రాంతంలో నిర్వహించే ఓ వివాహానికి హజరయ్యారు. అనంతరం తిరిగి ఇంటికి అదే వాహనంలో బయలుదేరారు. అయితే ఆ వ్యాన్ దేవా ప్రాంతానికి చేరుకునే సరికి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఈ ఐదుగురు అక్కడిక్కడే మరణించారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జలౌన్ జిల్లాలో కూడా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ఐదుగురు మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. మధుఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పురా సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. దీంతో ఇందులో ఉన్న ఐదురుగు చనిపోయారు. పలువురికి గాయాలవడంతో వారిని ప్రథమ చికిత్స కోసం మధుఘర్ లోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అనంతరం వారిని వైద్య కళాశాలకు తరలించారు. ఈ బస్సులో ఉన్న ప్రయాణికులంతా రాంపురంలో నిర్వహించిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు.
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
జలౌన్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
