మధ్యప్రదేశ్ లో బస్సు బోల్తా పడటంతో 15 మంది మరణించారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. 

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేవాలో బస్సు బోల్తా పడటంతో దాదాపు 15 మంది చనిపోయారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. 30వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆన్‌లైన్ రమ్మీకి వ్యసనమై అప్పులు.. స్నేహితుడి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరి చేసిన ఎస్సై.. ఎక్కడంటే ?

కొంతమంది బాటసారులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి, ధ్వంసమైన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో బస్సు క్యాబిన్‌లో ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Scroll to load tweet…

పోలీసులు ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను పిలిపించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం టీంథర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సుల్లో వెళ్తున్నారని తెలిపారు. 

Scroll to load tweet…

ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రయాణికులతో నిండిన బస్సు పర్వత రహదారిపై బోల్తా పడిందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు జబల్‌పూర్‌ నుంచి రేవా మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తోందని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియరాలేదని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.