Gandhinagar: ఆగివున్న ఒక ట్ర‌క్కును వేగంగా వ‌చ్చిన ఒక జీపు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  

Gujarat road accident: గుజ‌రాత్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆగివున్న ఒక ట్ర‌క్కును వేగంగా వ‌చ్చిన ఒక జీపు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. పటాన్ జిల్లాలోని వారాహి సమీపంలో గురువారం (ఫిబ్రవరి 16) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ప్ర‌యాణికులతో ఉన్న మహీంద్రా జీపు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు మాట్లాడుతూ.. గుజరాత్ లోని పటాన్ జిల్లాలో ఆగివున్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారని తెలిపారు. 

రాధాన్ పూర్ సమీపంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న మహీంద్రా జీప్ టైర్ పేలడంతో వాహ‌నం అదుపు తప్పింది. డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో రోడ్డుమార్గంలో ప‌క్క‌గా ఆగివున్న ట్ర‌క్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేకే పాండ్యా తెలిపారు. జీపు వారాహి గ్రామం వైపు వెళ్తోందని చెప్పారు. 

మృతులను సంజుభాయ్ ఫుల్వాడి (50), దుడాభాయ్ రాథోడ్ (50), రాధాబెన్ పర్మార్ (35), కాజల్ పర్మార్ (59), అమృత వంజారా (15), పినాల్బెన్ వంజారా (7)గా గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను రాధన్ పూర్, పటాన్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు పాండ్యా తెలిపారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని తెలిపారు. విచార‌ణ త‌ర్వాత త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

Scroll to load tweet…

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళా కార్మికులు మృతి

ఆటో- బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మహిళా కార్మికులు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలోని చౌటుప్పల్ లోని దండుమల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా కార్మికులు ప్రయాణిస్తున్న ఆటోను ఒక ప్ర‌యివేటు బస్సు ఢీకొట్టింది.

సమీప గ్రామానికి చెందిన మహిళలు రోజువారీ పనుల కోసం పారిశ్రామిక ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులను వి.అనసూయ (55), డి.నాగలక్ష్మి (28), డి.శ్రీశిహ (30), సి.ధనలక్ష్మి (35)గా గుర్తించారు.

రంగారెడ్డి జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మొయినాబాద్ వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.