Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై మళ్లీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. 

Fatal road accident.. Bus fell into valley on Jammu-Srinagar national highway.. 10 killed..ISR
Author
First Published May 30, 2023, 8:32 AM IST

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్.. ఎనిమిది మంది కూలీలు మృతి

ఝజ్జర్ కోట్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు అమృత్ సర్ నుంచి కత్రాకు పర్యాటకులతో వెళ్లోంది. ఈ ఘటనపై జమ్మూ డీసీ స్పందించారు. పలువురు ప్రయాణికులతో అమృత్ సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిందని, దీంతో పది మంది చనిపోయారని చెప్పారు. గాయాలపాలైన వారిని హాస్పిటల్ కు తరలించామని తెలిపారు.

నిర్మల్ లో విషాదం.. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన యువకుడు.. ఈతరాకపోవడంతో..

కాగా.. గతవారం దక్షిణ కశ్మీర్ లోని బర్సూ అవంతిపొరా వద్ద శ్రీనగర్ -జమ్మూ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన పర్యాటకులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాకు చెందినవారు. 

ఇటీవల అవంతిపొరా ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సీఆర్పీఎఫ్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఓ బంకర్ దగ్గర సీఆర్పీఎఫ్ వాహనం ఆగి ఉండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios