Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి..

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలోని కొండల్లో ఓ ట్రైనింగ్ విమానం శనివారం కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలెట్, ప్లేన్ ఇన్ స్ట్రక్టర్ చనిపోయారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. 

Fatal accident in Madhya Pradesh.. Training plane crashes, two pilots killed..
Author
First Published Mar 19, 2023, 7:33 AM IST

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. ఇందులో ఒకరు ప్లేన్ ఇన్ స్ట్రక్టర్ కాగా.. మరొకరు మహిళా ట్రైనీ పైలట్ అని అధికారులు తెలిపారు.

హిందూ కూతుళ్లను కించపరిచే వారి చేతులు నరికేస్తాం - కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే

శిక్షణలో ఉన్న ఐజీఆర్ ఏయూ (ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ)కి చెందిన ఈ విమానం ప్రమాదానికి కారణమని పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఓ అధికారి తెలిపారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సంఘటనా స్థలం నుంచి తీవ్రంగా కాలిపోయిన రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బాలాఘాట్ ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు.

బాలాఘాట్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని లాంజీ, కిర్నాపూర్ ప్రాంతాల్లోని కొండల్లో కాలిపోయిన ఓ వ్యక్తి మృతదేహం (పైలట్ మోహిత్ ఠాకూర్దిగా భావిస్తున్నారు) ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ‘‘ ఈ ప్రమాదంపై మాకు మధ్యాహ్నం 3:45 గంటలకు సమాచారం అందింది. ఈ ప్రాంతం నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కిందకు రావడంతో భద్రతా బలగాలను రప్పించారు. వారు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా కాలిపోయిన ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్, మహిళా పైలట్ మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రదేశం లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది’’ అని సౌరభ్ చెప్పారు.

జీవితంలో ఏమైనా చేయండి.. మీ మాతృభాషను ఎప్పటికీ వదులుకోవద్దు : అమిత్ షా

బాలాఘాట్ సరిహద్దులోని గోండియా జిల్లాలోని బిర్సీ ఎయిర్ స్ట్రిప్ నుంచి మధ్యాహ్నం 3.06 గంటలకు శిక్షణ విమానం బయలుదేరిందని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. అయితే మధ్యాహ్నం 3.11 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు.

కాలిపోయిన మృతదేహం పైలట్ మోహిత్ ఠాకూర్ (సుమారు 25 సంవత్సరాలు)దిగా భావిస్తున్నారని, మహిళా ట్రైనీ పైలట్ వృశంక మహేశ్వరి (సుమారు 20 సంవత్సరాలు) కనిపించకుండా పోయారని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మ‌హిళ‌పై రిటైర్డ్ బీఎస్ఎఫ్ జ‌వాను దాడి..

ఈ ప్రమాదంపై ఐజీఆర్ ఏయూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్య కుమార్ గోండియా వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. బాలాఘాట్ జిల్లాలోని భుక్కుటోలా గ్రామ సమీపంలోని కొండలపై మధ్యాహ్నం 3:30 గంటలకు విమానం కూలిపోయిందని, ఇందులో ఫ్లైట్ ట్రైనింగ్ కెప్టెన్, మహిళా ట్రైనీ మృతి చెందారని తెలిపారు. ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్ కెప్టెన్ మోహిత్ తో కలిసి ట్రైనర్ విమానం బిర్సీ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిందని చెప్పారు. భుక్కుటోల గ్రామ సమీపంలోని కొండల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇది కూలిపోయినట్లు తెలిపారు. కాగా.. విమానం శిథిలాలను గుర్తించిన వెంటనే స్థానిక గ్రామస్తులు మొదట ఘటనా స్థలానికి చేరుకున్నారని సత్య కుమార్ గోండియా చెప్పారు. తరువాత అగ్నిమాపక బృందం, బిర్సీకి చెందిన రెస్క్యూ టీం, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios