మహిళపై రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాను దాడి..
Nagpur city: మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాను ఒక మహిళపై దాడి చేశాడు. రెండేళ్ల చిన్నారితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రిటైర్డ్ జవాను చితకబాదిన ఘటన నాగ్ పూర్ లో చోటుచేసుకుందనీ, కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Retired BSF jawan beats up woman in Nagpur: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ ఎఫ్) రిటైర్డ్ జవాను ఒక మహిళపై దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే..నాగ్ పూర్ నగరంలో రెండేళ్ల చిన్నారితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను బీఎస్ఎఫ్ రిటైర్డ్ జవాను కారు ఢీకొనడంతో.. సదరు మహిళ కారును ఆపడానికి ప్రయత్నించగా, ఆమెపై మాజీ జవాను దాడి చేశాడు. నిందితుడు శివ శంకర్ శ్రీవాస్తవపై వేధింపులు, దాడి ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
"జరిపట్కా ప్రాంతంలోని భీమ్ చౌక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం శ్రీవాస్తవ కారు మహిళ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ మహిళ తన స్కూటర్ ను ఎలాగోలా కంట్రోల్ చేయగలిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ద్విచక్రవాహనాన్ని ఆపి ఫొటో తీసింది. అనంతరం కారు కదలకుండా ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన శ్రీవాస్తవ కారులోంచి దిగాడు. మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఇతర వ్యక్తులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు" అని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీవాస్తవను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అనంతరం వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడని అతని బంధువులు పోలీసులకు చెప్పడంతో పోలీసులు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.