తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ - రోహ్ తక్ హైవే ను దిగ్భందించారు. భారత్ భూమి బచావో సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది. 

ఢిల్లీ-రోహ్ తక్ హైవేను రైతులు బుధవారం దిగ్బంధించారు. అక్కడే పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పేరుకుపోయింది. భారత్ భూమి బచావో సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో రైతులు ఈ నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో భాగంగా రైతులు ‘హర్యానా బంద్’ కు పిలుపునిచ్చారు.

విచిత్రం.. నాలుగు నెలల కిందట చనిపోయాడని భావించిన వ్యక్తి.. మోమోస్ తింటూ కనిపించాడు..ఎక్కడంటే ?

రైల్ కారిడార్ కోసం భూసేకరణ సమయంలో ఇచ్చిన పరిహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రైతులంతా ఈ నిరసన చేపట్టారు. జాతీయ రైతు నాయకుడు రమేష్ దలాల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగింది. అయితే రోడ్డు దిగ్బంధించకూడదని పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఝజ్జర్ లోని కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై మండోతి టోల్ ప్లాజా వద్ద రెండు లైన్లలో కూర్చొని నిరసన తెలుపుతున్న రైతులు గత 159 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

Scroll to load tweet…

ఈ సందర్భంగా రమేష్ దలాల్ మాట్లాడుతూ.. ఖాప్ పంచాయితీలు, హర్యానా రైల్ ఓరిబిటల్ కారిడార్ ద్వారా నిర్వాసితులైన ప్రజల మద్దతుతో బహదూర్ గఢ్ గ్రామాల రైతులు ఈ బంద్ కు పిలుపు వచ్చిందని చెప్పారు. సోనిపట్ లోని మునాక్ కాలువను కూడా తమ సంస్థతో సంబంధం ఉన్న రైతులు విచ్ఛిన్నం చేశారని తెలిపారు. ఢిల్లీలో నీటిని నిలిపివేశామని, రైలు మార్గాలను కూడా త్వరలోనే మూసివేస్తామని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ‘‘న్యాయం కోసం పోరాడుతున్న మా కూతుళ్ల (రెజ్లర్లు)ను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పుడు హరియాణా బంద్ కు దిగడం తప్ప మరో మార్గం లేదు. మాకు మద్దతు అందించడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలి’’ అని అన్నారు. 

శానిటరీ ఉత్పత్తుల కొరత, రుతుక్రమ విద్యపై అవగాహన లేమి.. భారత్ లో ప్రతీ ఐదుగురిలో బడి మానేస్తున్న ఓ బాలిక..

కాగా.. మండోటి టోల్ ప్లాజా వద్ద ఆదివారం రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 25 అంశాల ఎజెండాతో పాటు గ్రామ ప్రతినిధులు, ఖాప్ అధిపతులు, ఢిల్లీ, రాజస్థాన్, హరియాణాకు చెందిన ఇతర ప్రముఖులతో కూడిన 21 మంది సభ్యుల కమిటీని కూడా సిద్ధం చేశారు. ఈ నెల 18న తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతు కూడగడతామని ప్రకటించారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జూలై 6వ తేదీన ఎన్నికలు.. బ్రిజ్ భూషణ్ కు ఛాన్స్ ఉందా ? లేదా ?

రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
తమ వద్ద సేకరించిన భూమికి నష్టపరిహారం పెంచాలని కోరడంతో పాటు డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని, పొద్దుతిరుగుడుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), రైతులకు రుణాలను మాఫీ చేయాలని, ఖాప్ పంచాయతీలు లేవనెత్తిన పలు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు.