కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి రచించిన ‘‘ టెన్ ఐడియాలజీస్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిజం నుంచి సోషలిజం వరకూ భావజాలాన్ని సంక్షిప్తంగా పొందుపరిచానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, మేధావులు హాజరయ్యారు.